
పార్టీకి కవిత నష్టం కలిగించారు
● ఆమె ఆరోపణలను ఎవరూ
పట్టించుకోవడం లేదు
● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నిజామాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ కవిత పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే కేసీఆర్ ఆ మైపె సస్పెన్షన్ వేటు వేశారని నిజామాబాద్ రూర ల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు, సంతోష్‌రావుపై కవిత చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కవిత సస్పెన్షన్ విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని, కేసీఆర్ తన కూతురు కన్నా పార్టీ భవిష్యత్ ముఖ్యమని ఈ ని ర్ణయం తీసుకున్నారని అన్నారు. కవిత ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీగా కవిత జిల్లాకు ఎన్నో సేవలు అందించినప్పటికీ పా ర్టీ సిద్ధాంతాలు, నియమాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో చర్యలు తప్పలేదన్నారు. ఈ వ్యవహారం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూ పబోదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడమని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారని అన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ జె డ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు పాల్గొన్నారు.
కవిత ఫొటో కనిపించకుండా స్టిక్కర్
బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో అధినేత కేసీఆర్, కేటీఆర్, కవిత చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కవిత ఫొటో కనిపించకుండా స్టిక్కర్ అతికించారు. పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో స్టిక్కర్ వేశారు.