
గ్రామపంచాయతీ ఓటర్లు 8,51,417
● తుది ఓటరు జాబితా విడుదల
సుభాష్‌నగర్: గ్రామ పంచాయతీలకు సంబంధించి తుది ఫొటో ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులు మంగళవారం విడుదల చేశారు. జాబితా ప్రకారం 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 3,96,778 మంది పురుషులు, 4,54,621 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలు ఉన్నాయి. గత నెల 28న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేయగా, గత నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 31న అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించారు. జిల్లాలో అత్యధికంగా డిచ్‌పల్లిలో 46,893 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా చందూర్ 8,816 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం వార్డు వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేష న్ల జాబితాలను అన్ని గ్రామపంచాయతీల్లో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రదర్శించామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు.
మహిళా ఓటర్లే అధికం..
అన్ని మండలాల్లో అధికంగా ఉన్న మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 57,843 మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నట్లు తుది ఓటరు జాబితా ప్రకారం వెల్లడైంది.