
శోభాయాత్రకు ఆటంకాలు కలగొద్దు
నిజామాబాద్‌అర్బన్/నవీపేట/నందిపేట్: ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణే శ్ నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృ ష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రత్యేక బస్సులో పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్యతోపాటు ఇతర అధికారులతో కలిసి ప్రయాణిస్తూ శోభాయాత్ర రూట్‌ను కలెక్టర్ పరిశీలించారు. నిజా మాబాద్ నగరంలోని వినాయకబావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, సార్వజనిక్ గణేశ్ మండలి ప్రతినిధులతో కలిసి నిమ్మజన ఏ ర్పాట్లపై చర్చించారు. నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. యంచ, నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి బ్రిడ్జీల వద్ద నది ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడక్కడ చెడిపోయిన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. ఎనిమిది అడుగులకు పైగా ఎత్తున్న ప్రతిమలను నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్దకు తరలించి నిమజ్జనం చేయాలన్నారు. గోదావరి బ్రిడ్జిల క్రేన్‌లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్‌కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు రాజా వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ రావు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను పరిశీస్తున్న కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య
నిజామాబాద్‌లోని వినాయకుల బావిని
పరిశీలిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ

శోభాయాత్రకు ఆటంకాలు కలగొద్దు