
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
● ఇందిరమ్మ లబ్ధిదారులు పనులు
ప్రారంభించేలా చొరవ చూపాలి
● సమీక్షలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివద్ధి పనులను తక్షణమే ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయించాలని క లె క్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించా రు. నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో డబు ల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కు మార్, ఇతర అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల అసంపూర్తి పనులు, పెండింగ్‌లో ఉన్న ఇతర అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే నాటికే సాధ్యమైనంత వరకు పెండింగ్ పనులను పూర్తి చేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇళ్లు మంజూరైన వారు వెంటనే మార్కింగ్ చేసుకుని నిర్మాణ పనులు చేపట్టేలా చొరవచూపాలన్నారు. లబ్ధిదారులకు ఐకేపీ, మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు మంజూరయ్యేలా చూ డాలన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ఆరో గ్య ఉప కేంద్రాలు, అంగన్‌వాడీ సెంటర్ల భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక్కో శాఖ వారీగా పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేశారు. జెడ్పీ సీఈవో సాయా గౌడ్, హౌసింగ్ పీడీ పవన్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో రాజశ్రీ పాల్గొన్నారు.