
పూజలందుకుంటున్న గణనాథులు
తెయూ(డిచ్‌పల్లి)/మోపాల్/సిరికొండ : తెలంగాణ యూనివర్సిటీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వినాయకుడికి వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ని ర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. మోపాల్ మండలం మోపాల్, కంజర్, కులాస్‌పూర్, మంచిప్ప, సిర్‌పూర్, న్యాల్‌కల్, ముదక్‌పల్లి, బాడ్సి, సింగంపల్లి, తదితర గ్రామాల్లో, సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్కోల్, పెద్దవాల్గోట్ గ్రామాల్లో వినాయక మండపాల వద్ద నిర్వహకులు అన్నదానం చేశారు.
గణేశ్ నిమజ్జనానికి బల్దియా అధికారుల ఏర్పాట్లు
నిజామాబాద్ సిటీ : వినాయక నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 6న నిర్వహించే గణేశ్ శోభాయాత్ర ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొదలు నుంచి చివరి వరకు ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బందిని నియమిస్తూ మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. దుబ్బ బాలగంగాధర్ తిలక్ జంక్షన్ నుంచి పాత గంజ్ మీదుగా బోధన్‌బస్టాండ్, గురుద్వారా, పెద్దబజార్, గోల్‌హనుమాన్, ఫులాంగ్ చౌరస్తా, వినాయకుల బావి వరకు రూట్‌మ్యాప్‌లో అధికారులను నియమించారు. మున్సిపల్ డీఈలు సుదర్శన్‌రెడ్డి, భూమేశ్వర్, నరేందర్, సయ్యద్ వాజిద్, సాయిచంద్, పావని, టీపీఎస్‌లు అనుపమ, జి.శ్రీకాంత్, తదితరులున్నారు.

పూజలందుకుంటున్న గణనాథులు