
ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకున్న ధన్‌పాల్
సుభాష్‌నగర్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పాటిల్‌తో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజ, హారతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేశ్‌ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్‌ని ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు.