
విభిన్న రూపాయ.. వినాయకాయ
నిజామాబాద్ రూరల్ : నగరంలోని వివిధ మండపాల నిర్వహకులు విభిన్న రకాల వినాయకులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఖిల్లా రోడ్డులో శ్రీమహ్మదేవి యూత్ ఆధ్వర్యంలో పద్మనాభస్వామి రూపంలో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వర్నిచౌరస్తాలో భక్త హిందూ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో విభూతి గణేశ్, ఖిల్లా చౌరస్తాలోని శ్రీశివసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో గణేశ్, మహ్మదేవినగర్‌లో శ్రీభజరంగ్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గోమతి చక్రాల గణేశ్, బురుడుగల్లి గాజులపేటలో శ్రీరవీంద్రగణేష్ మండలి ఆధ్వర్యంలో పసుపుకొమ్ములతో గణేశ్, ఖిల్లా రోడ్డు చౌరస్తాలో రైజింగ్ స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మట్టి దీపాలతో గణేశ్, వినాయక్‌నగర్‌లోని హైందవ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలగణపతి మట్టి విగ్రహం, చంద్రశేఖర్‌కాలనీలో శ్రీ సిద్ధివినాయక గణేశ్ మండలి ఆధ్వర్యంలో పద్మనాభస్వామి గణేశ్, ఠాణాగల్లిలో ఏర్పాటు చేసిన శ్రీమారుతి గణేష్ మండలి ఆధ్వర్యంలో పేపర్, మైదా పిండితో చేసిన గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.మండపాలను నిర్వహకులు రాత్రిసమయంలో విద్యుత్ దీపాలతో సెట్టింగ్స్‌తో తీర్చిదిద్దడంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో విభిన్న వినాయక విగ్రహాలను వీక్షించేందుకు ప్రజలు తరలివస్తున్నారు.

విభిన్న రూపాయ.. వినాయకాయ

విభిన్న రూపాయ.. వినాయకాయ

విభిన్న రూపాయ.. వినాయకాయ