
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం చారిత్రక నిర్ణయం
నిజామాబాద్ సిటీ : రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రక నిర్ణయమని పీసీసీ ప్రధాన కార్యదర్శి నరేశ్ జాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. అనంతరం నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ అంటేనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బీఆర్‌ఎస్, బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, జావెద్ అక్రమ్, సేవాదళ్ సంతోష్, ప్రమోద్, మధుసూదన్, విఘ్నేష్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు.