
ఆత్మహత్య సరైన నిర్ణయం కాదు
నిజామాబాద్‌నాగారం: భారతదేశంలో ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య అని, మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఆత్మహత్య సరైన పరిష్కారం కాదని భారత మానసిక వైద్యుల సంఘం డైరెక్ట్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ వి శాల్ ఆకుల అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఆదివా రం నిర్వహించిన భారత మానసిక వైద్యుల సంఘం సదస్సుకు డాక్టర్ విశాల్ హాజరయ్యారు. సదస్సులో ఆత్మహత్య – ప్రపంచవ్యాప్త, భారతదేశ సమస్య అనే దానిపై చర్చించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేధిక ప్రకారం ప్రతి ఏడాది దాదాపు ఏడు లక్షల మంది ఆత్మహత్యల ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఆధారంగా ప్రతి ఏడాది 1,70,000 కంటే ఎక్కువ మంది చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలే క ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రపంచంలోనే మహిళల ఆత్మహత్యల్లో మూడోవంతు భారత్‌లోనే చోటుచేసుకుంటుందన్నారు. ఆత్మహత్యల ని వారణకు పలు సూచనలు చేశారు. ప్రమాదకర పదార్థాలపై ప్రాప్యతను నియంత్రించాలని, మీడి యా ఆత్మహత్యలను సంచలనాత్మకంగా చూపకుండా నివారించాలన్నారు. మానసిక ఆరోగ్య సమస్య లు, వ్యసన రుగ్మతలతో బాధపడుతున్న వారిని ముందుగానే గుర్తించి చికిత్స అందించాలన్నారు.