
గోదావరి పరీవాహక ప్రాంతాల పరిశీలన
నవీపేట: గోదావరి నది పరీవాహక ప్రాంతాలైన మండలంలోని కోస్లీ, మిట్టాపూర్, యంచ, అల్జాపూర్ గ్రామాలను అడిషనల్ కలెక్టర్ అంకిత్ శుక్రవారం పరిశీలించారు. యంచ వద్ద గోదావరి నదిలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతిని పరిశీలించారు. నీట మునిగిన పంటలతోపాటు రహదారిపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు. పూర్తిగా వరద నీటితో మునిగిన అల్జాపూర్ రహదారిని పరిశీలించారు. ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, ఏవో నవీన్‌కుమార్, ఏఈలు తదితరులు ఉన్నారు.