● మంజీరా నదికి పోటెత్తిన వరద
● జలదిగ్బంధంలో మూడు గ్రామాలు
● బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు, నాయకులు
బోధన్: బోధన్, సాలూర, పోతంగల్ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న మంజీర నదికి రెండు రో జులుగా వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు తో డు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో మంజీరలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం వరకు వరద ప్రవాహం భారీగా పెరగడంతో సాలూర మండలంలోని మందర్నా, ఖాజాపూర్, హున్సా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. ఐతే, వరద ముప్పును ముందే ప సిగట్టిన ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామ స్తులు అప్రమత్తమయ్యారు. ఖాజాపూర్ గ్రామంలో ని సుమారు 200 మంది ముంపు బాధితులను నా యకులు ట్రాక్టర్ల ద్వారా సాలూరలోని పెరిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సాలూర తహసీల్దార్ శశిభూషణ్ గు రువారం రాత్రి హున్సా గ్రామానికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎ స్సై మచ్చేందర్ రెడ్డి, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది లోత ట్టు ప్రాంతాల ఇళ్ల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బాధితులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నాం, రాత్రికి భోజన సదుపాయం కల్పించారు. సాలూర పీహెచ్‌సీ డాక్టర్ రాజ్‌కుమార్ వైద్య సేవలందించారు. ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, నాయకులు ఇల్తెపు శంకర్, నాగేశ్వర్ రావు, చిద్రపు అశోక్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్ శిబిరాన్ని సందర్శించి వరద బాధితులతో మాట్లాడారు.
ఉప్పొంగుతున్న వాగులు
సాలూర మండలంలోని ఖాజాపూర్–హున్సా గ్రామాల మధ్య పెద్దవాగు, సాలూర–ఖాజాపూర్ గ్రామాల మధ్య నరిగాగు, హున్సా–మందర్నా గ్రామాల మధ్య లోలెవల్ వాగు వంతెన మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హున్సా, మందర్నా గ్రామాల ప్రజలు సురక్షితంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, శుక్రవారం రాత్రి హున్సా వద్ద వరద ఉధృతి కొంతమేర పెరిగినట్లు తెలిసింది.
ముప్పు పసిగట్టి.. అప్రమత్తం