
హైదరాబాద్‌కు బస్సుల పునరుద్ధరణ
ఆర్మూర్‌టౌన్/ఖలీల్‌వాడి: భారీ వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు నిజామాబాద్–హైదరాబాద్ రూట్లో బస్సుల రాకపోకలను నిలిపివేసిన విష యం తెలిసిందే. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి బస్సుల రాకపోకలను ప్రారంభించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో ప్రతి రోజు 588 బస్సులు ఉండగా ఇందులో 468 బస్సులు వివిధ రూట్లకు నడిపిస్తున్నారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి మీదు గా హైదరాబాద్‌కు బస్సులు నడుస్తున్నాయి. మెదక్ నుంచి జెబీఎస్‌కు, ఎల్లారెడ్డి, భీమ్‌గల్ తదితర రూ ట్లలో బస్సులను నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు వివిధ రూట్లలో ఉన్న రోడ్ల పరిస్థితులకు అనుకూలంగా బస్సులను నడిపిస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న తెలిపారు.
ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు..
ఎన్‌హెచ్ 44 హైవే నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర ప్రాంతాల భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో భారీ వాహనాలను హైవేపైనే పోలీసులు నిలిపివేశారు. దీంతో శుక్రవారం వాహనాలు ముందుకు కదులుతున్నాయి. ఒక్కసారిగా వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి జంగంపల్లి వరకు ఉన్న ఎన్‌హెచ్–44పై కిలోమీటర్ల మేర వా హనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు హై దరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లడానికి గంటకు ఒక కిలోమీటర్ వరకు ముందుకు కదులుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో పోలీసులు ఆర్మూర్ నుంచి వాహనాలను మళ్లింపు చేశారు. నిర్మల్ నుంచి వచ్చే వాహనాలను ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ నుంచి మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
రైళ్ల రద్దు..
కామారెడ్డి జిల్లా త ల్లమడ్ల వద్ద రైల్వేట్రాక్ నీటి ప్రవాహంకు కొ ట్టుకపోవడంతో రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని నిజామాబాద్ నుంచి ఆర్మూర్, కరీంనగర్, పెద్దపల్లి, ఖాజీపేట్ మీదుగా కాచిగూడకు నడిపించారు. కానీ శుక్రవారం బాసర రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో రైల్వేశా ఖ అధికారులు, రైల్వే ఎస్సై సాయిరెడ్డి పరిస్థితిని పరిశీలించారు. దీంతో బాసర మీదుగా నిజామాబాద్ రైల్వే జంక్షన్‌కు వచ్చే అన్ని రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌కు బస్సుల పునరుద్ధరణ