
పెరుగుతోన్న జ్వర పీడితులు
ఆర్మూర్‌టౌన్: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వా తావరణ మార్పులతో ఆర్మూర్‌లో ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజురోజుకు జ్వరం, ఒళ్లు తదితర లక్షణాలతో కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆర్మూర్ ఏరి యా ఆస్పత్రిలో ఓపీల సంఖ్య గతంలో కంటే రెండింతలు పెరిగింది. 250 నుంచి ఓపీ సంఖ్య ప్రస్తు తం ప్రతిరోజు 500 వరకు వస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న పట్టణంలోని వివిధ గురుకుల పాఠశాల విద్యార్థులను ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.
దోమల నివారణ చర్యలు శూన్యం
పట్టణంలో దోమల బెడద ఉంది.ఎక్కువగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
● రోగులతో కిటకిటలాడుతున్న
ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి
● ప్రతిరోజు 500ల వరకు ఓపీ
నిర్లక్ష్యం చేయవద్దు
వర్షాలు కురుస్తున్న తరుణంలో బయటి వాతావరణంలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, దగ్గు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి సలహాతో మందులు వాడాలి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వా రికి వైద్య సేవలు అందిస్తున్నాం. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. – ప్రణీత,
సూపరింటెండెంట్,ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి