రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన ఇరుగందుల శివ (17) అనే విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, సోమవారం కాలేజీకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేడు. కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం ఫిర్యాదు చే యగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
బాల్కొండ: మండలంలోని జలాల్‌పూర్ గ్రామంలో గురువారం పిచ్చి కుక్క దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి శిరీషతో పాటు మరో ఇద్దరిపై దాడి తీవ్రంగా గాయపరిచింది. అలాగే ఏడు గేదే దూడలను కూడ తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు వెంటపడి పిచ్చికుక్కను చంపివేశారు. గాయాలపాలైన వారు బాల్కొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని రాకాసీపేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పావురం కలకలం రేపింది. స్థానికులు పట్టుకొని చూడగా పావురం కాళ్లకు రింగులు, కోడ్‌తో కూడిన కాగితాలు కట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పావురాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. పావురం ఎక్కడి నుంచి వచ్చింది, దాని కాళ్లకు ఉన్న రింగులపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, పది రోజుల క్రితం బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో ఇలాంటి పావురమే కనిపించింది.
విద్యార్థి అదృశ్యం
విద్యార్థి అదృశ్యం