
వరదలో చిక్కుకొని రైతు మృతి
బీబీపేట: భారీ వర్షాల కార ణంగా వచ్చిన వరదల్లో మండలంలోని జనగామకు చెంది న ఓ రైతు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరా లు ఇలా.. మండలంలోని జ నగామకు చెందిన కప్పెర రా జిరెడ్డి (63) వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించేవాడు. సాగు పనుల నిమిత్తం బుధవా రం పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేడు. అతడి పొ లం పక్కకే ఎడ్ల కట్ట వాగు ప్రవహిస్తుండడం, బీ బీపేట పెద్దచెరువు పూర్తిగా నిండి బ్యాక్ వాటర్ పొలంలోకి చేరడంతో అందులో గల్లంతయ్యా డు. గ్రామస్తులు ఎంత వెతికినా అతడి ఆచూకి లభించకపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి స మాచారం అందించారు. వారు గురువారం ఉద యం గాలింపు చేపట్టగా రాజిరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ప్రహరీ కూలి యువ వైద్యుడు..
రాజంపేట: వరద నీటిని మ ళ్లించే ప్రయత్నంలో ప్రహరీ కూలి రాజంపేటలో యువ డాక్టర్ ఇప్పకాయల వినయ్ (28) మృతి చెందాడు. బుధవారం కురిసిన భారీ వర్షంతో బీసీ కాలనీకి సమీపంలో ఉ న్న దేవుని చెరువు అలుగుపారింది. చెరువులోకి వచ్చే కట్టు కాలువ ఉధృతి పె రిగి నీరు బీసీ కాలనీ వైపు తిరుగుముఖం పట్టి ఇ ళ్లలోకి చేరింది. వినయ్ ఇంట్లోకి సైతం నీళ్లు చేరడంతో వాటిని మళ్లించేందుకు గడ్డపార సహాయంతో ప్రహరీని కూల్చేందుకు ప్రయత్నించా డు. ఈ క్రమంలో గోడ కూలి మీద పడడంతో వి నయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వినయ్ గుండారం పల్లె దవాఖానాలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పండుగ పూట డాక్టర్ మరణించడంతో రాజంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి నట్లు ఎస్సై దత్తాత్రి గౌడ్ తెలిపారు.

వరదలో చిక్కుకొని రైతు మృతి