
జాతీయస్థాయి బేస్‌బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
డిచ్‌పల్లి: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన 5వ సీనియర్ మహిళలు, పురుషుల బేస్‌బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన క్రీడాకారిణులు సౌమ్యారాణి (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ డిగ్రీ కాలేజీ, ఆర్మూర్), శృతి (జీజీ డిగ్రీ కాలేజీ, నిజామాబాద్), అనూష, శరణ్య (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, సుద్దపల్లి), పురుషల విభాగంలో సాయికుమార్ (జీజీ డిగ్రీ కాలేజీ) జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28 నుంచి 31వరకు మహారాష్ట్ర అమరావతిలో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్ మధుసూదన్‌రెడ్డి, సొప్పరి వినోద్ తెలిపారు. క్రీడాకారులను మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, గంగామోహన్, సాఫ్ట్‌బాల్ అకాడమీ కోచ్ నరేశ్, మౌనిక, పీఈటీలు జ్యోత్స్న, నర్మత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.