
మోదీపై పోటీ చేసిన ఇస్తారి మృతి
● 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి పసుపు రైతుల తరఫున పోటీ
మోర్తాడ్(బాల్కొండ): పార్లమెంట్ ఎన్నికల్లో (20 19) ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసిన పసుపు రైతు సున్నపు ఇస్తారి(78) అనారోగ్యంతో మృతి చెందా రు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్‌తో నిజామాబాద్, వారణాసి పార్లమెంట్ స్థానాల బరిలో పసుపు రైతులు పోటీ చేసిన విష యం తెలిసిందే. పసుపు బోర్డు సాధనే ధ్యేయంగా నాటి ఎన్ని కల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వివి ధ పార్టీల అభ్యర్థులతో పాటు 178 మంది రైతులు పోటీ చేశారు. అయితే నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసి నుంచి బరిలో నిలిస్తే తమ డిమాండ్ దేశమంతా తెలుస్తుందనే ఉద్దేశంతో నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాల నుంచి 25 మంది రైతులు వారణాసికి వెళ్లి ఆయనపై పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 24 మంది నామినేష న్లు తిరస్కరణకు గురి కాగా, ఏర్గట్లకు చెందిన సున్నపు ఇస్తారి నామినేషన్‌కు ఆమోదం లభించింది. ఆ ఎన్నికల్లో ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. నీటి సంఘం చైర్మన్‌గా వ్యవహరించిన ఇస్తారి ప్రధానిపై పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇస్తారి శనివా రం రాత్రి ఆయన ఇంట్లో కన్నుమూశారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహించగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై నివాళులు అర్పించారు.