
మోసానికి గేట్‌వే!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గే యాప్స్ ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్షించి తమ దగ్గరకి రప్పించుకుని వారికి తెలియకుండా నగ్న వీడియో లు తీసి బ్లాక్ మెయిలింగ్ దందా నడిపిన ముఠా సభ్యులు ఐదుగురిని ఈనెల 2న కామారెడ్డిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిపై ఇప్పటికే 11 కేసులు నమోదవగా.. బాధితులు నలభై మంది దాకా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా వందల్లో ఉంటారని సమాచారం. బాధితుల్లో కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన వారూ ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా కొందరు బాధితులు తమ విషయం బయటకు పొక్కితే పరువు పోతుంద న్న ఉద్దేశంతో బయటకు రావ డం లేదు. ఈ కేసులో స్థానిక పో లీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న ము ఠా సభ్యుల కస్టడీ కోసం పిటిషన్ వేసి వారిని మ రింత లోతుగా విచారించే అవకాశాలున్నాయి.
ముందుగా బాధితుల వివ రాలు సేకరించి వారి ద్వారా ఫిర్యాదులు తీసుకుని ఎంత నష్టపోయారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు యాభై మంది వరకు బాధితులను గుర్తించినట్లు సమాచారం. బాధితులు ఇంకా వందల్లో ఉంటారని భావిస్తు న్నారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు అరెస్టయిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
యాప్ ద్వారా స్వలింగ
సంపర్కులకు వల
నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్
రూ. లక్షలు వసూలు చేస్తున్న ముఠా
ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్
బాధితుల గురించి ఆరా తీస్తున్న
పోలీసులు