
కమిటీల ఆధ్వర్యంలోనే పనులు
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్మీడియట్ విద్య బలోపేతం కోసం ప్రభుత్వం జూనియర్ కళాశాలలకు కేటాయించిన నిధులను అమ్మ ఆదర్శ కమిటీల ఆ ధ్వర్యంలోనే ఖర్చు చేయాలని ఇంటర్ బోర్డు జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శనివారం నిర్రవహించిన సమావేశంలో ఒడ్డెన్న మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మతులు, అభివద్ధి పనులు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు కేటాయించిన నిధుల కోసం అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, ప్రిన్సిపాల్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. బోర్డు కమిషనర్ ఆదేశాల కళాశాలల్లో విద్యార్థుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా ఆన్‌లైన్ అటెన్‌డెన్స్ విధానం అమలు చేయాలని, విద్యార్థులు కళాశాలలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యా అకడమిక్ సెల్ ప్రతినిధి నర్సయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
కళాశాలల తనిఖీ
ఒడ్డెన్నతోపాటు రవికుమార్ డిచ్‌పల్లిలోని ప్ర భుత్వ జూనియర్ కళాశాల, నిజామాబాద్ బాలుర ఖిల్లా జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకడమిక్ అంశాలను సమీక్షించారు.