దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే నమ్మరు | - | Sakshi
Sakshi News home page

దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే నమ్మరు

Aug 4 2025 4:50 AM | Updated on Aug 4 2025 4:50 AM

దేవుళ

దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే నమ్మరు

ఆర్మూర్‌ : దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే ప్రజలు నమ్మరని, ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిన బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కల ఆటతో పార్టీ భూస్థాపితమైందన్నారు. రాబోయే 15 ఏళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ నియోజకవర్గంలో చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ రెండోరోజైన ఆదివారం కొనసాగింది. ముందుగా ఆలూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క శ్రమదానం చేశారు. అక్కడి నుంచి ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌కు చేరుకున్నారు. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ శివారులో ఉన్న యమునా గార్డెన్స్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు కార్యకర్తలతో మాట్లాడించి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ మా ట్లాడుతూ.. ఓట్ల సమయం వస్తేనే జైశ్రీరామ్‌ అంటూ మాట్లాడే బీజేపీ నేతలు పేదల గురించి ఆలోచించరని విమర్శించారు. శ్రీరాముడికి బీజేపీలో మెంబర్‌షిప్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము కూడా శ్రీరాముడిని పూజిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కలిసి ఉండి సమష్టిగా పని చేయా ల ని పిలుపునిచ్చారు. కార్యకర్తల వల్లే తాము ఈ రోజు పదవుల్లో ఉన్నామని, రాబోయే స్థానిక ఎ న్నికల్లో కార్యకర్తలకు పదవులు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పాత కార్యకర్తలకు సము చిత స్థానం ఉంటుందని అలాగే కొత్తవారికి ప్రాఽ దాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. పదేళ్లు పార్టీ కోసం కష్ట నష్టాలకోర్చి లాఠీ దెబ్బలు తిని, జైళ్ల పాలైన వారిని పార్టీ విస్మరించబోదన్నారు.

త్వరలో వ్యవసాయ కళాశాల..

తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ క ళాశాల ఏర్పాటు చేసుకున్నామని త్వరలోనే వ్యవసాయ కళాశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చా రు. వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే నిజామాబాద్‌ జిల్లాలో మెడికల్‌ కళాశాల, గుత్ప ఎత్తిపోతల పథకం, తెలంగాణ యూనివర్సిటీ ఏర్పా టు చేయడంతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టామని గుర్తు చేశారు. షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై నిపుణులతో అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు.

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఇన్‌చార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, ఎ మ్మెల్సీ బల్మూరి వెంకట్‌, మాజీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, ఆకుల లలిత, ఆర్మూర్‌, బాల్కొండ ని యోజకవర్గాల ఇన్‌చార్జులు వినయ్‌రెడ్డి, సునీల్‌ రెడ్డి, ఈరవత్రి అనిల్‌, మార గంగారె డ్డి, మార చంద్రమోహన్‌, బాడ్సి శేఖర్‌రెడ్డి, గడ్కోల్‌ భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సాయిబాబా గౌడ్‌, ఖాందేశ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అధికారంలోకి

వచ్చే పరిస్థితి లేదు

మేము కూడా శ్రీరాముడిని పూజిస్తాం

నాలుగు ముక్కల ఆటతో

బీఆర్‌ఎస్‌ భూస్థాపితమైంది

మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం..

పార్టీలో పాత, కొత్త నాయకులకు సముచిత స్థానం

పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ముగిసిన జనహిత పాదయాత్ర

రాహుల్‌ స్ఫూర్తితోనే ‘జనహిత’

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3,500 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకొనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పేర్కొన్నారు. దేశంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలంతా ఒకే కుటుంబమన్నారు. రాహుల్‌ గాంధీ సూచన మేరకు తెలంగాణలో శాసీ్త్రయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించేలా కృషి చేయడంతో అందరూ తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. బీజేపీ మాత్రం నాగ్‌పూర్‌ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ దేశ ప్రజలను మతం పేరిట విడదీస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే నమ్మరు1
1/1

దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే నమ్మరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement