
గుంతను పూడ్చిన అధికారులు
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి సమీపంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతను ఆర్‌అండ్‌బీ అధికారులు పూడ్చివేశారు. నడిరోడ్డుపై గుంత.. వాహనదారులకు చింత అనే కథనాన్ని సాక్షి దినపత్రికలో జూలై 29న ప్రచురితమైంది. ముందుగా స్పందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది వాహనదారులకు హెచ్చరికగా రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఎర్రజెండాను ఏర్పాటు చేసి సమస్యను ఆర్‌అండ్‌బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుంతను పూడ్చిన అధికారులు