
ఇందిర ఆత్మీయ భరోసా కోసం ఆందోళనలు
సిరికొండ: ఇందిర ఆత్మీయ భరోసా అమలుకు కోసం ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, రమేశ్ తెలిపారు. మండలంలోని గడ్కోల్‌లో శనివారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 5న కలెక్టరేట్, 20న జీపీలు, 21 నుంచి 30 వరకు తహసీల్ కార్యాలయాలు, సెప్టెంబర్ 10న చలో సెక్రటేరియట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బాల్‌రెడ్డి, సాయారెడ్డి, అశోక్, దయాల్‌సింగ్, ఎర్రన్న, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.