
స్నేహితులకు అండగా..
ఇందల్వాయి: ఇరవై ఏళ్ల క్రితం పదో తరగతిలో మొదలైన స్నేహం ఇంకా కొనసాగిస్తూ వారిలో ఎవరికి ఆపదొచ్చినా అన్ని విధాల అండగా నిలుస్తూ, తాము చదివిన పాఠశాలకు కూడా సేవలు చేస్తున్నారు ఎల్లరెడ్డిపల్లెకి చెందిన 2005–06 పదో తరగతి పూర్వ విద్యార్థులు. తమ స్నేహానికి గుర్తుగా మొదట చదివిన పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని 2010 లో ఏర్పాటు చేశారు. అనంతరం తమ మిత్ర బృందంలో ఉంటూ అకాల మరణం చెందిన స తీశ్ కుటుంబానికి రూ. 35 వేలు, ప్రమాదంలో గాయపడ్డ గంగాధర్‌కు రూ. 85 వేలు, స్నేహి తురాలు భర్తకి పక్షవాతం వస్తే వైద్య ఖర్చుల ని మిత్తం రూ. 30 వేలు అందించారు. తమ స్నేహి తుల్లో ఎవరికి ఆపద వచ్చినా అన్ని విధాల ముందుంటామని ధీమాగా చెబుతున్నారు.