
బీజేపీ బీసీ ధర్నాలో జిల్లా నాయకులు
సుభాష్‌నగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు జిల్లా నాయకులు హాజరయ్యారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ నేతృత్వంలో ఓబీసీ మోర్చా కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ధర్నాలో ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఓట్లతో గెలిచి వారి ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టిందని ఆరోపించారు. నాయకులు రంజిత్, శ్రీనివాస్, మారుతి, సురేశ్ తదితరులు ఉన్నారు.