
లెక్చరర్లను నియమించాలి
సుభాష్‌నగర్: జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్‌యూ కళాశాల కమిటీ కార్యదర్శి నసీర్, ఉపాధ్యక్షుడు వినోద్ డిమాండ్ చేశారు. శని వారం ఈమేరకు ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కళాశాలలో ప్రతి కోర్సుకు సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. తరగతులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ సరిపడా అధ్యాపకులు లేరన్నా రు. వెంటనే లెక్చరర్లను నియమించాలని డిమాండ్‌చేశారు. నాయకులు సృజన్, అజయ్, కిరణ్, ధీరజ్, భీమేశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.