
రేషన్ కార్డుల పంపిణీ
డిచ్‌పల్లి: ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు డాక్టర్ షాదుల్లా అన్నారు. శనివారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్‌కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని షాదుల్లా అన్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, డాక్టర్ లింబాద్రి, బాజేందర్, హరీశ్, గంగిభూపతి, సాగర్, రాంచందర్, సతీశ్‌రెడ్డి, దేవేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.