
సమస్యలు పరిష్కరించాలి
తెయూ(డిచ్‌పల్లి): తెయూలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వర్సిటీ పీడీఎస్‌యూ నాయకులు గౌతమ్‌రాజ్ డిమాండ్ చేశారు. క్యాంపస్‌లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాంపస్‌లోని బాలుర, బాలికల హాస్టల్స్‌లో సమస్యలు నెలకొన్నాయన్నారు. వాష్ బేసిన్స్‌లో నల్లాలు రావడం లేదని, కిటీలకు జాలీలు లేక దోమలు కుట్టడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. బాలికల హాస్టల్‌లో గదులు సరిపోక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే పనులను ప్రారంభించాలని డి మాండ్ చేశారు. నాయకులు రాకేశ్, ఆకాశ్, ప్రభాస్, తిరుపతి తదితదిరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేత
సిరికొండ: ఆపదలో ఉన్న మిత్రుడికి ఆర్థిక సాయం చేసి ఆదర్శంగా నిలిచారు మిత్ర బృందం. పోత్నూర్ గ్రామానికి చెందిన దర్శనం బాలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పెద్దవాల్గోట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో 2000–01 బ్యాచ్ అతడి పదో తరగతి మిత్రులు పెద్దవాల్గోట్, చిన్నవాల్గోట్, పోత్నూర్, రేకుల్‌పల్లి గ్రామాలకు చెందిన వారు రూ. 44500 లను బాలయ్యకు ఆయన ఇంట్లో శనివారం అందజేశారు. బాలయ్య కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
నియామకం
ఖలీల్‌వాడి: చేనేత పద్మ సమైఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సిలివేరి గణేశ్‌ను నియామిస్తూ శనివారం రాష్ట్ర చేనేత పద్మ సమైఖ్య అధ్యక్షుడు కొండా రామమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. పద్మశాలిల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మోపాల్: మండలంలోని కంజర్ శివారులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఫిజిక్స్ జూనియల్ లెక్చరర్ పార్ట్ టైమ్ పోస్టుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయలలిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్, బీఈడీ విద్యార్హతలు కలిగిన వారు అర్హులన్నారు. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో కళాశాలలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9949356342 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.
11న పెన్షనర్ల ధర్నా
ఖలీల్‌వాడి: పెండింగ్ డీఏల విడుదల, కొత్త పీఆర్సీ అమలు, నగదు రహిత వైద్యసేవలు, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్ల సాధనకు ఈ నెల 11న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ సమస్యలపై మంత్రులను, అధికారులను పదేపదే కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ధర్నాను పెన్షనర్లు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో శిర్ప హనుమాండ్లు, నారాయ ణ, జార్జ్, భోజారావు, నరేందర్, సాంబశివరా వు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో
ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు
సిరికొండ: మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే ఇంగ్లిషు అక్షరాల ఆకారంలో కూర్చుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపాల్ నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మోడల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే..
జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు అలరించాయి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధారాణి, రవికుమార్, నజీర్, సత్యం సాయి, బాల రాజు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి