
ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు!
నేడు స్నేహితుల దినోత్సవం
సిరికొండ: హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన ఆ స్నేహితులు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూనే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తీసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని తూంపల్లిలో 2010–11 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన 23 మంది స్నేహితులు 2021లో హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం సేవా భావంతో అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న అనే నినాదంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తు, ఇప్పటి వరకు 160 యూనిట్ల రక్తాన్ని సేకరించి చికిత్స పొందుతున్న వారికి అందించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వె య్యికి పైగా మొక్కలు నాటారు. వారు చదువుకున్న పాఠశాలలో పేద విద్యార్థులకు నోటు పుస్త కాలు, స్టేషనరీ అందిస్తున్నారు. ఇటీవల కొండాపూర్‌లో చెరువులో పడి మృతి చెందిన వీఆర్‌ఏ తూము సుదర్శన్ ముగ్గురు పిల్లలను సంస్థ ద్వారా చదివిస్తున్నారు. స్వచ్ఛ ఘన్‌పూర్..
డిచ్‌పల్లి: తమ గ్రామాన్ని స్వచ్ఛంగా తయారు చే యాలనే సంకల్పంతో స్నేహితులంతా కలిసి స్వచ్ఛ ఘన్‌పూర్ పేరుతో బృందంగా ఏర్పడ్డారు. డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లో మూడేళ్ల క్రితం 15 మంది తో ప్రారంభించిన ఈ బృందంలో ఇప్పుడు 40 మంది వరకు చేరారు. గ్రామంలోని కాలనీల్లో ఎక్క డ చెత్త, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు కనిపించినా స్వచ్ఛ ఘన్‌పూర్ సభ్యులు వెంటనే శుభ్రం చేస్తారు. మురికి కాలువలు ధ్వంసమైతే వెంటనే వాటిని సరిచేస్తారు. ప్రతి నెలా రూ.100 చొప్పున డబ్బులు జమచేసి గ్రామంలో ఎవరైనా పేద కుటుంబానికి చెందిన వారు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సా యం అందజేస్తున్నారు. ఇటీవల గణేశ్ అనే యువ కుడు చనిపోతే వారి కుటుంబానికి రూ.50వేలు ఆర్థి క సాయం అందజేశారు. ఇలా స్నేహితులంతా కలి సి సమాజసేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
మన జీవితంలో ఒక్కసారి మధుర క్షణాల్ని గుర్తు చేసుకుంటే అందులో అత్యధికం స్నేహితులు మన వెంట ఉన్నవే ఎక్కువగా ఉంటాయి. అందులోనూ స్కూల్, కాలేజీ స్నేహం ప్రత్యేకం. జిల్లాలో కొందరు చిన్న నాటి నుంచి మొదలైన స్నేహం ఇంకా కొనసాగిస్తూ వారిలో ఎవరికై న ఆపద వస్తే అండగా నిలుస్తూ స్నేహానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. మరికొందరు తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఇంకొందరు రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని కాపాడాలని మిత్రులతో కలిసి స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేశారు.

ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు!