‘మీ సేవ’ సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

‘మీ సేవ’ సమస్యలను పరిష్కరించాలి

May 10 2025 2:05 PM | Updated on May 10 2025 2:05 PM

‘మీ సేవ’ సమస్యలను పరిష్కరించాలి

‘మీ సేవ’ సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌ సిటీ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు, అసోసియేషన్‌ సభ్యులు మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని ఆయన చాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సమస్యలను విన్న మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారని అసోసియేషన్‌ నాయకుడు లక్ష్మీనారాయణ తెలిపారు. మంత్రిని కలిసినవారిలో జీవన్‌ ప్రసాద్‌, కె.నారాయణ, మహ్మద్‌ నాసిర్‌ అహ్మద్‌, చింత రాజు, కొత్తపల్లి కిరణ్‌, జి శ్రీకాంత్‌, సాగర్‌బాబు, సీహెచ్‌ వేణు ఉన్నారు.

శిక్షణ తరగతులను

సద్వినియోగం చేసుకోవాలి

డిచ్‌పల్లి: మండలంలోని అన్ని ప్రభుత్వ, గురుకుల, మోడల్‌, కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 12 నుంచి 26వ వరకు వేసవి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎంఈవో ఈఎల్‌ఎన్‌ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. నృత్యం, సంగీతం, ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌ విభాగాల్లో శిక్షణ తరగతులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12గంటల వరకు నిర్వహిస్తారని అన్నారు. మండల కేంద్రంలోని మానవత సదన్‌లో శిక్షణ తరగతులు ఉంటాయన్నా రు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో కోరారు.

కొండాపూర్‌లో పోలీసు కళాజాత

సిరికొండ: మండలంలోని కొండాపూర్‌లో పోలీ సు కళా బృందం ఆధ్వర్యంలో కళాజాతను శు క్రవారం నిర్వహించారు. రోడ్డు భద్రత నియ మాలు, సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాలు, మూఢ నమ్మకాలు లాంటి అంశాలపై కళాకారు లు నాటికలు, పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఎస్సై ఎల్‌ రామ్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని అని అన్నారు. , ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసు కోవాలని సూచించారు.

నామినేషన్ల స్వీకరణ

నిజామాబాద్‌ నాగారం: నిజామాబాద్‌ పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఈ నెల 25న స్థా నిక పద్మశాలి ఉన్నత పాఠశాలలో జరగనున్నా యి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయనున్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అభివృద్ధి కమి టీ ప్యానెల్‌ సభ్యులు ఎన్నికల అధికారులకు నామినేషన్‌ పత్రాలను మార్కండేయ మందిరంలో అందజేశారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్‌ గంగా ప్రసాద్‌ వ్యవహరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్సార్‌ సత్యపాల్‌, అమృతపురం గంగాధర్‌, బిల్ల మహేశ్‌, మదన్‌మోహన్‌, సిలివేరి గణేశ్‌ పాల్గొన్నారు.

సీపీఎం నాయకుల సమావేశం

నిజామాబాద్‌ సిటీ: సామ్రాజ్యవాద కాంక్షనే జర్మన్‌ పాలకుడు హిట్లర్‌ లక్ష్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. నగరంలోని నాందేవ్‌వాడలో ఉన్న పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రష్యా సైన్యం చేతిలో జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ ఓటమి చెంది 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో నా యకులు నూర్జహాన్‌, శంకర్‌ గౌడ్‌, సుజాత, న న్నేసాబ్‌, సురేశ్‌, సిర్పలింగం, నర్సయ్య, అనిత శంషుద్దీన్‌, దినేశ్‌, సతీశ్‌, రాజు పాల్గొన్నారు.

వేసవి శిక్షణను

సద్వినియోగం చేసుకోవాలి

జక్రాన్‌పల్లి: మండలంలోని కలిగోట్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడా అధికారి ముత్తెన్న సూచించారు. శుక్రవారం కలిగోట్‌లో నిర్వహిస్తున్న వాలీబాల్‌ శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థా యికి ఎంపికయ్యేలా శిక్షణలో మెళకువలు నే ర్పాలన్నారు. అనంతరం క్రీడాకారులకు వాలీబాల్‌, నెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పురుషోత్తమచారి, సువర్ణ, వీడీసీ సభ్యులు, పీఈటీ యాదగిరి పాల్గొన్నారు.

ఆర్థికసాయం అందజేత

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని ఆకుల కొండూర్‌కు చెందిన ఆకాశ్‌ మృతి చెందడంతో బాధిత కుటుంబానికి అన్వేషణ యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడు అన్వేష్‌ అందించిన రూ. రెండు లక్షల ఆర్థికసాయాన్ని అతని మిత్రులు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో మా జీ సర్పంచ్‌ అశోక్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

సమ్మె పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌ సిటీ: కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌ కోరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు శంకర్‌ గౌడ్‌, సింగిరెడ్డి చంద్రరెడ్డి, నరేశ్‌, గంగాధర్‌, ప్రభాకర్‌, మురళి, థామస్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement