
దివ్యాంగులకు వీల్‌చైర్ల పంపిణీ
నిజామాబాద్‌నాగారం: రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మారుతినగర్‌లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్‌ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లోక రమణరెడ్డి హాజరై మాట్లాడారు. స్నేహ సొసైటీ, రోటరీ క్లబ్ లాంటి సంస్థలు కష్టాల్లో ఉన్న వ్యక్తులను, దివ్యాంగులను గుర్తించి వారికి సేవ చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ జేమ్స్ అధ్యక్షులు పద్మ శ్రీనివాస్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, గౌరీ శంకర్, జ్యోతి, రంజిత్ సింగ్ చౌహన్, చంద్రశేఖర్, దివ్యాంగులు, సిబ్బంది పాల్గొన్నారు.