ఆసియా గేమ్స్‌కు ‘ఇందూరు’ బిడ్డలు!

- - Sakshi

నిజామాబాద్‌నాగారం : ఆసియా క్రీడల్లో ఇందూరు కీర్తి పతాకం రెపరెపలాడనుంది. జిల్లా క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, గుగులోత్‌ సౌమ్య ఈ మెగా టోర్నీలో ఆడనున్నారు. పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. తనదైన శైలీలో పతకాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నిఖత్‌.. చిరుతలా పరుగెడుతూ గోల్స్‌ కొట్టే ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి గుగులోత్‌ సౌమ్య ఈ టోర్నీకి ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌన్‌ నగరంలో ఈ క్రీడలు జరగనున్నాయి.

మొదటిసారి పాల్గొంటున్నా
నేను మొదటి సారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్నా. ఈ టోర్నీలో ఆడటం నా కల. ఇందుకోసం చాలా కష్టపడ్డాను. గతంలో అంతర్జాతీయ టోర్నీల్లో ఆడే అవకాశం వచ్చినా, గాయాలతో ఇబ్బంది పడ్డాను. రెండు, మూడు టోర్నీలు మాత్రమే ఆడాను. ఈ టోర్నీలో సత్తా చాటుతా.
– గుగులోత్‌ సౌమ్య, ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి

పతకం సాధిస్తా..
మొదటిసారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్నా. 50 కేజీల విభాగంలో బరిలో దిగుతున్నా. ఈ క్రీడల్లో పతకం సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా. దీనికోసం నిరంతరం ప్రాక్టీస్‌ చేస్తున్నా.
– నిఖత్‌ జరీన్‌,

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top