విద్యార్థులకు బహుమతుల ప్రదానం
ఖలీల్‌వాడి: జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంఘిక శాస్త్ర ప్రతిభాపాటవ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సోమవారం బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంగ్లిష్, తెలుగు మీడి యం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇంగ్లిష్ మీడియంలో కె.నిహారిక (టీజీఎమ్‌ఎస్, ఆర్మూర్), జి.సరయు (టీజీఎమ్‌ఎస్, ఆర్మూర్), ఎస్. దర్శిని (టీజీఎమ్‌ఎస్, ధర్పల్లి) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కై వసం చేసుకున్నారు. తెలుగు మీడియంలో ఎం.అక్షయ (జెడ్పీహెచ్‌ఎస్, పెంటాకుర్దు), ఎం.సింధు (జెడ్పీహెచ్‌ఎస్, పెంటకలాన్), జి. నరసింహ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి త్వరలో రాష్ట్రస్థాయి ప్రతిభాపాటవ పరీక్ష హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీబీ చైర్మన్ సీతయ్య, నిజామాబాద్ సౌత్ ఎంఈవో సాయి రెడ్డి, సోషల్ ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి నారాయణ, గెజిటెడ్ హెచ్‌ఎంలు మురళి, రవి రవీందర్ ,వెంకట్రాంరెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


