క్రైం కార్నర్
నవీపేట: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మల్లెపూల శ్రీనివాస్(46) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. మూడు రోజుల క్రితం మండలంలోని నిజాంపూర్–తుంగిని గ్రామాల మధ్య రహదారిపై రెండు బైకులు ఢీకొనడంతో నవీపేటకు చెందిన రాజు అక్కడికక్కడే మృతి చెందగా మల్లెపూల శ్రీనివాస్, నరేశ్ గాయపడ్డారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మల్లెపూల శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు.
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపి ఒకరికి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష సాయితల్ప సాయి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఉద్మీర్‌గల్లీకి చెందిన గంగాధర్ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకొని బోధన్ కోర్టులో హాజరుపర్చారు. వారం రోజుల జైలు శిక్షను విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు తెలిపారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్ గ్రామశివారులో ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు చేసి పేకాడుతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ పేర్కొన్నారు. వారి నుంచి రూ.3,200, మూడు ఫోన్ల్, మూడు బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ షాప్‌లో పేకాడుతున్న ఆరుగురిని పట్టుకొని వారి నుంచి రూ.3,480 నగదు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.


