కుటుంబకలహాలతో భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో భర్త ఆత్మహత్య

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

కుటుంబకలహాలతో భర్త ఆత్మహత్య

కుటుంబకలహాలతో భర్త ఆత్మహత్య

కుటుంబకలహాలతో భర్త ఆత్మహత్య హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

భార్యను కాపాడిన స్థానికులు

చిన్న మల్లారెడ్డి చెరువు వద్ద ఘటన

కామారెడ్డి క్రైం: భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ ఒకరి ఆత్మహత్యకు దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన చింతమడక రాజేశ్వర్‌ (45), అతని భార్య అర్పిత సోమవారం కామారెడ్డికి వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తుండగా చిన్న మల్లారెడ్డి కల్లు దుకాణం వద్ద ఆగారు. అక్కడ కుటుంబ విషయాలపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన రాజేశ్వర్‌ పక్కనే ఉన్న చెరువులో దూకేశాడు. గమనించిన అర్పిత కూడా చెరువులోకి దూకేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రాజేశ్వర్‌ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఐదో టౌన్‌ ఎస్సై గంగాధర్‌ తెలిపారు. జనవరి 22న ముజాయిద్‌నగర్‌లోని బాబాకిరాణం షాపు వద్ద గొడవ జరిగింది. ఈ వ్య వహరంలో జహీర్‌ అనే వ్యక్తికి కత్తిపోట్లు జరిగాయి. ఘటనలో జునేద్‌, మునవర్‌, అబ్దుల్‌వహీద్‌, మహ్మద్‌ షేక్‌ రఫీక్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గౌస్‌, ఫజీల్‌ పరారీలో ఉన్నారని, నిందితుల నుంచి కత్తి, రెండు రాడ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement