రీల్స్‌... ఏఐ కాల్స్‌ | - | Sakshi
Sakshi News home page

రీల్స్‌... ఏఐ కాల్స్‌

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

రీల్స

రీల్స్‌... ఏఐ కాల్స్‌

పురపోరులో వినూత్నంగా

అభ్యర్థుల ప్రచారం

ఓటర్లను ఆకర్షించేలా

సోషల్‌ మీడియా వాడకం

నిజామాబాద్‌ రూరల్‌: పురపోరులో అభ్యర్థులు ప్రచారానికి సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. గెలుపే ధ్యేయంగా ఓటర్లను ఆకర్షించేలా సాంకేతికతను వాడుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

రీల్స్‌.. షార్ట్‌ వీడియోలు

ప్రస్తుతం అందరి చేతుల్లో మొబైల్స్‌ సర్వసాధారణం. మున్సిపల్‌ డివిజన్‌, వార్డుల్లో ఓటర్లందరూ అభ్యర్థులకు తెలిసే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరుకు తమ సందేశం చేరేలా అభ్యర్థులు సోషల్‌ మీడియాను ఎంచుకున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో రీల్స్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌ ద్వారా షార్ట్స్‌ చేస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యలపై వివరిస్తూ తమను గెలిపిస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వార్డులు, డివిజన్‌లో రోజూవారీగా చేస్తున్న ప్రచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రచారానికి ఉపయోగిస్తున్న కరపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌లను ముద్రిస్తూ వాటి ద్వారా తమ వీడియో సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తున్నారు.

ఏఐ కాల్స్‌...

అభ్యర్థులు ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను సైతం విరివిగా వాడుతున్నారు. అభ్యర్థుల స్వరంతో ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. ఏఐ ద్వారా ప్రచార పోస్టర్లను తయారు చేయిస్తున్నారు.

రీల్స్‌... ఏఐ కాల్స్‌ 1
1/1

రీల్స్‌... ఏఐ కాల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement