టీఎన్జీవోస్ ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ
నిజామాబాద్ అర్బన్: ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి సంతాపంగా జిల్లాకేంద్రంలో సోమవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఉద్యోగులందరూ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి నగరంలోని ప్రధాన కూడలీల వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం సౌమ్య మృతిపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. సౌమ్య మృతికి కారకులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమన్‌రెడ్డి, పెద్దోళ్ల నాగరాజు, శివకుమార్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


