భైంసాకు పోటెత్తిన సోయా | - | Sakshi
Sakshi News home page

భైంసాకు పోటెత్తిన సోయా

Oct 15 2026 11:29 AM | Updated on Oct 15 2026 11:29 AM

భైంసాటౌన్‌: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు బుధవారం భారీగా సోయాలు విక్రయానికి వచ్చాయి. సోమవారం ఈ–నామ్‌ సర్వర్‌ సమస్య, రైతుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం బీట్‌ నిలిపివేశారు. బుధవారం మార్కెట్‌కు 649 లాట్లు విక్రయానికి రాగా యార్డులో స్థలం లేకపోవడంతో ఏఎంసీ అధికారులు వాహనాలను ఎదురుగా ఉన్న కాటన్‌యార్డుకు తరలించారు. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా గాంధీగంజ్‌లోని యార్డుకు అనుమతించారు. ఈనామ్‌ సర్వర్‌ పునరుద్ధరించడంతో వ్యాపారులు ఆన్‌లైన్‌లో ధరలు నమోదు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు బిడ్డింగ్‌ కొనసాగింది. సోయాకు అత్యధికంగా క్వింటాలుకు రూ.7,099 ధర పలకగా, నువ్వులకు రూ.13వేలు, శనగలకు రూ.6,666, మినుములకు రూ.8,604 ధర పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement