యువ వికాసం | - | Sakshi
Sakshi News home page

యువ వికాసం

Oct 15 2026 11:29 AM | Updated on Oct 15 2026 11:29 AM

● పథకం అమలు దిశగా అడుగులు ● నవంబర్‌లో ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ● నిరుద్యోగుల్లోచిగురిస్తున్న ఆశలు

నిర్మల్‌చైన్‌గేట్‌: యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. గతేడాది ఏప్రిల్‌లో దరఖాస్తులు స్వీకరించి వెరిఫికేషన్‌ పూర్తి చేశారు. జూన్‌ 1 నాటికి ప్రొసీడింగ్స్‌ సిద్ధం చేశారు. అయినా ఆ తర్వాత పురోగతి లేకుండా పోయింది. ఇటీవల ప్రభుత్వం పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించింది. దీంతో అధికారులు అమలు దిశగా చర్యలు చేపట్టారు. 17 నెలల క్రితం అర్హులైన యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొదటి విడతలో నవంబర్‌ 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో యువతలో ఆశలు చిగురించాయి. గతేడాది జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్ధిదారులకు చెక్కులు అందజేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement