నిర్మల్చైన్గేట్: వీబీజీ రామ్జీ పథకం కింద అర్హులందరికీ ఉపాధి కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ఉపాధి కల్పన, నీటి సంరక్షణ పనులు చేపట్టే అంశాలపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, క్షేత్ర సహాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పనికి వెళ్లేలా ప్రజల్ని ప్రోత్సహించాలన్నారు. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన సాగాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది వివరాలను అడిగి తెలు సుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్ పూర్తి చేయాలన్నా రు. నర్సింగ్ వృత్తి అంటే ప్రజలకు నిస్వార్థ సే వలందించడమేనని, విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మంజుల, వివిధ శాఖల అధికారులు, కళాశాల సిబ్బం పాల్గొన్నారు


