రిసార్ట్స్‌ బకాయిలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

రిసార్ట్స్‌ బకాయిలపై విచారణ

Oct 10 2026 12:10 AM | Updated on Oct 10 2026 12:10 AM

కడెం: మండలకేంద్రంలోని టూరిజం సంస్థకు చెందిన బృందావన్‌ రిసార్ట్స్‌ బకాయిలపై అడిషనల్‌ కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌, టూరిజం శాఖ ఏజీఎం రమేశ్‌, అధికారుల బృందం శుక్రవా రం విచారణ చేపట్టారు. రిసార్ట్స్‌ నిర్వహణ, బకాయిలపై ఎమ్మెల్యే బొజ్జు ఇటీవల కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అధికారులు విచారణకు వచ్చారు. బృందావన్‌ రిసార్ట్స్‌ కడెం–పెద్దూర్‌ పంచాయతీకి రూ.40,9251 ట్యాక్స్‌, విద్యుత్‌ బకాయి సుమారు రూ.2 లక్షల వరకు, టూరిజం శాఖకు చెల్లించాల్సిన లీజు బకాయి ఉన్నాయి. ఈ విషయమై అడిషనల్‌ కలెక్టర్‌ వివరణ కోరగా.. కలెక్టర్‌కు నివేదించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement