నిర్మల్‌టౌన్/భైంసాటౌన్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం జిల్లాలో ప్రశాతంగా జరిగా యి. ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియ న్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ కలిసి పోటీ చేయగా, తెలంగాణ వర్కర్స్ యూనియన్, వర్కర్స్ ఫెడరేషన్ మరో కూటమి గా బరిలో నిలిచాయి. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) కూడా పోటీలో ఉంది. నిర్మల్ డిపోలో జరిగిన ఎన్నికల్లో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రెండు స్థాయిల్లో ఓటింగ్
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సంస్థకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం కోసం క్లాస్–3కు, రీజియన్ పరిధిలోని సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు రీజియన్ స్థాయి గుర్తింపు సంఘం కోసం క్లాస్–6కు ఓటింగ్ నిర్వహించారు.
90 శాతం పోలింగ్..
నిర్మల్ డిపో పరిధిలో 385 ఓట్లు ఉండగా, 370 పో లయ్యాయి. ఎంప్లాయీస్ యూనియన్–తెలంగా ణ మజ్దూర్ యూనియన్‌కు రాష్ట్రస్థాయి క్లాస్–3లో 319 ఓట్లు, డిపోస్థాయి క్లాస్–06 లో 300 ఓట్లు వచ్చాయి. బీఎంఎస్‌కు రాష్ట్రస్థాయిలో 29, డిపో స్థాయిలో 13 ఓట్లు లభించాయి. తెలంగాణ వర్క ర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూటమికి రాష్ట్రస్థాయిలో 37, డిపోస్థాయిలో 37 ఓట్లు వచ్చాయి. దీంతో ఎంప్లాయీస్–తెలంగాణ మజ్దూర్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. భైంసా డిపో పరిధిలో మొత్తం 193 మంది ఓటర్లు ఉండగా, 189 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. భైంసా డిపోలో క్లాస్–3కి 177, క్లాస్–6కు 178 ఓట్లు పోలయ్యాయి.


