న్యూస్‌రీల్
నిర్మల్ రూరల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నా యి. కాలేజీలకు 21 వరకు, పాఠశాలకు ఈనెల 22 వరకు సెలవులు కొనసాగుతాయి. షెడ్యూ ల్ ప్రకారం ఈనెల 12 నుంచి సెలవులు ప్రారంభం కావాల్సిఉండగా.. రెండో శనివారం, ఆది వారంతో ముందుగానే సెలవులు వచ్చాయి.
మానసిక ఆరోగ్యంపై
అవగాహన ఉండాలి
నిర్మల్‌టౌన్: మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రత్యేక సబ్‌జైలులో న్యాయ సేవల క్లినిక్ ప్రారంభించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రాజలింగం, మానసిక వైద్యనిపుణుడు సురేశ్ అల్లాడి, ప్రత్యేక సబ్‌జైలు సూపరింటెండెంట్ సూర్యప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.


