నాణ్యమైన వైద్య విద్య అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్య విద్య అందించాలి

Oct 10 2026 12:10 AM | Updated on Oct 10 2026 12:10 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్య, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన సదుపాయాల కల్పన, తదితర అంశాలపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. వైద్య కళాశాలలోని విద్యార్థుల సంఖ్య, వారి విద్యా సంబంధిత విషయాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన ప్రాక్టికల్‌ శిక్షణ ఇచ్చినప్పుడే వారి సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆయా విభాగాల్లో అవసరమైన వైద్య సేవలను అందించేందుకు కావాల్సిన పరికరాలన్నీ ప్రాధాన్యత క్రమంలో సమకూర్చుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజేందర్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ శారద, ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్‌సింగ్‌, డీసీహెచ్‌వో కాశీనాథ్‌, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ రైజింగ్‌–2047 లక్ష్యంగా స్థానిక వనరులను వినియోగించుకుంటూ కొత్త పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అమూల్‌ సంస్థను ఆదర్శంగా తీసుకుని జిల్లాలో పాల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభించే వనరులతో వినూత్న వ్యాపారాలు ప్రారంభించేలా ఔత్సాహికులను ప్రోత్సహించాలని తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, ఎల్‌డీఎం రామ్‌గోపాల్‌, పారిశ్రామికవేత్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రెవెన్యూ, అటవీ భూములకు హద్దులు

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో రెవెన్యూ, అటవీ భూసమస్యల పరిష్కారానికి భూముల రీసర్వే దోహదపడుతుందని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూముల రీసర్వే, అటవీ–రెవెన్యూ భూసమస్యలు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రీ సర్వే ప్రక్రియను సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని గడువులోపు పూర్తిచేయాలన్నారు. రీసర్వేతో అటవీ, రెవెన్యూ, నీటిపారుదల తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన భూముల హద్దులను స్పష్టంగా గుర్తించి, భూ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని ఆదేశించా రు. ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌, డీఎఫ్‌ వో సుశాంత్‌ సుఖదేవ్‌ బోబడే, ఆర్డీవో దేవిదాస్‌, ల్యాండ్‌ సర్వే అండ్‌ రికార్డ్స్‌ ఏడీ విఠల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement