భైంసా: శరన్నవరాత్రి ఉత్సవాలకు బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లు చేశామని, పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. ఈ నెల 16న మూల నక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఇందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. భక్తుల సౌకర్యార్థం రవాణా, భద్రత, తాగునీరు, వెలుతురు తదితర వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆమె ‘సాక్షి’కి ఇచ్చి న ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.
సాక్షి : ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
ఈవో : శరన్నవరాత్రి ఉత్సవాలకు బాసరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాం. ఉత్సవాల సమయంలో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా చూస్తాం.
సాక్షి : మూల నక్షత్రం వేడుకకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
ఈవో :మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రద్దీని నియంత్రించేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటున్నాం.
సాక్షి : ఈసారి పూజా కార్యక్రమాల్లో మార్పులు ఉంటాయా?
ఈవో : ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అమ్మవారి ఉపాసకుల కోసం తొమ్మిది రోజులపాటు డార్మెటరీ హాల్‌ను కేటాయించాం.
సాక్షి : దూర ప్రాంతాల భక్తుల రవాణా సౌకర్యం కల్పిస్తున్నారా?
ఈవో : భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వరకు రాత్రింబవళ్లు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం. రైలులో వచ్చే భక్తులు ఆలయానికి చేరుకోవడానికి, తిరిగి వెళ్లడానికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది. భక్తులు రవాణా విషయంలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నాం.
సాక్షి : భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఈవో : ఉత్సవాల సందర్భంగా అన్ని ప్రాంతాల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేశాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు చేపట్టాం. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
సాక్షి : ఉత్సవాలకు ఎవరిని ఆహ్వానించారు?
ఈవో: అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల ని ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులను ఆహ్వానించాం. స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాం. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.
సాక్షి : భక్తులకు చేసే సూచనలు ఏమిటి?
ఈవో : శరన్నవరాత్రి ఉత్సవాలకు బాసరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినా ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా చూస్తాం. భక్తులకు అ వసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. అమ్మవారి ద ర్శనానికి వచ్చే భక్తులు సహకరించి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలి.
సాక్షి : గోదావరి తీరంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ఈవో : గోదావరి నది తీరానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం షవర్లు ఏర్పాటు చేశాం. రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బంది పడకుండా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశాం. ఆలయ పరిసరాలతోపాటు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తగిన వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టాం.


