ప్రీప్రైమరీకి నిధులు | - | Sakshi
Sakshi News home page

ప్రీప్రైమరీకి నిధులు

Oct 5 2026 11:54 PM | Updated on Oct 5 2026 11:54 PM

● జిల్లాలో 88 పాఠశాలలు ● టీచర్లు, ఆయాలకు వేతనాలు మంజూరు

జిల్లా సమాచారం...

మొత్తం ప్రీ ప్రైమరీ పాఠశాలలు 88

ఇన్‌స్ట్రక్టర్లు 88

మొత్తం ఆయాలు 88

ఇన్‌స్ట్రక్టర్ల నెల వేతనం రూ.8 వేలు

ఆయాల నెల వేతనం రూ.6 వేలు

జిల్లాకు వచ్చిన మొత్తం నిధులురూ.61,60,000

లక్ష్మణచాంద: కార్పొరేట్‌ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అని చెప్పి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచి వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీన్ని అరికట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రీ–ప్రైమరీ తరగతులు ప్రారంభించింది.

జిల్లాలో 88

పాఠశాలలు..

జిల్లా వ్యాప్తంగా 19 మండలాలు, 400 గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 88 ప్రీ–ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే ఏర్పాటు చేశారు. ఈ తరగతి గదులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. పెయింటింగులు, వి విధ రకాల చార్టులు, చిన్నారులు ఆడుకునేందుకు అ వసరమైన ఆట వస్తువులు ఏర్పాటు చేసి కార్పొరేట్‌ పాఠశాలల హంగులకు ఏమాత్రం తీసిపోకుండా తయారు చేశారు. వీరికి బోధించడానికి ఒక ఇన్‌స్ట్రక్టర్‌, ఒక ఆయాను నియమించారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెల కు రూ.8 వేలు, ఆయాకు నెలకు రూ.6 వేల గౌ రవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎదురుచూస్తున్న సిబ్బంది

ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు ఐదు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. దసరా పండుగకు వస్తాయన్న ఆశతో ఉన్న సమయంలో ప్రభుత్వం ఐదు నెలల వేతనాలు విడుదల చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ మొత్తం తమకు అందించాలని కోరుతున్నారు.

త్వరలో ఇచ్చేలా చర్యలు

జిల్లాలోని 88 ప్రీప్రైమరీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం 5 నెలల వేతనాలు విడుదల చేసింది. మూడు నాలుగు రోజుల్లో వారికి ఇచ్చేలాగా చూడాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. టీచర్లకు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేలు చెల్లిస్తారు. – భోజన్న, డీఈవో

ఐదు నెలల వేతనాలు..

ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. ప్రస్తుతం వారికి ఐదు నెలలకు సంబంధించిన వేతనాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు గౌరవ వేతనాలను అమ్మ ఆదర్శ పాఠశాలల ఖాతాల్లో జమ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement