నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో రూ.23.35 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న గోదావరి పుష్కరాల రహదారుల నిర్మాణ పనులు, రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పాలనా సేవలు అందించేందుకు చేపడుతున్న ఈ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్‌లో ఘన స్వాగతం..
అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతోపాటు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్ భవేశ్‌మిశ్రా పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు మంత్రులకు గౌరవ వందనం సమర్పించారు.


