వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Oct 5 2026 11:54 PM | Updated on Oct 5 2026 11:54 PM

వాతావరణం

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు స్పల్పంగా పెరుగుతాయి. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.

భైంసాలో డీజిల్‌ కొరత

భైంసాటౌన్‌: పట్టణంలోని పలు పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం నుంచే కొన్ని బంకుల్లో డీజిల్‌ నిల్వలు నిండుకోవడంతో నోస్టాక్‌ బోర్డులు పెట్టారు. ఒకే బంకులో డీజిల్‌ ఉండడంతో వాహనదారులు భారీగా క్యూ కట్టారు. అక్కడా నిల్వలు అయిపోవడంతో రైతులు, రోజువారీ వినియోగదారులు అవస్థలు పడ్డారు. పంట కోతలు ఊపందుకోవడంతో వినియోగం పెరిగి డీజిల్‌ కొరత ఏర్పడి ఉంటుందని బంకుల నిర్వాహకులు తెలిపారు. ఈ విషయమై డీసీఎస్‌వో రాజేందర్‌ను ఫోన్‌లో సంప్రదించగా, కొరత లేదని పేర్కొన్నారు. వినియోగం పెరిగి తాత్కాలిక కొరత ఏర్పడి ఉండవచ్చన్నారు.

భైంసా మార్కెట్‌కు

పోటెత్తిన సోయా

భైంసాటౌన్‌: పట్టణంలోని ఏఎంసీ మార్కెట్‌ యార్డుకు సోమవారం సోయా పోటెత్తింది. పంట కోతలు పూర్తయిన రైతులు మార్కెట్‌లో విక్రయించేందుకు నేరుగా తీసుకువస్తున్నారు. 315 లాట్లు వచ్చినట్లు ఏఎంసీ అధికారులు తెలిపారు. క్వింటాలుకు రూ.5,366 నుంచి గరిష్టంగా రూ.6,113 ధరను వ్యాపారులు చెల్లించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement