నిర్మల్ టౌన్: విద్యార్థినులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇచ్చేందుకు పాఠశాలలను ఎంపిక చేశారు. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఝాన్సీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల తుది జాబితాను సిద్ధం చేశారు. సీనియర్ మాస్టర్ తేజేందర్ సింగ్ భాటియా సమక్షంలో సోమవారం వివిధ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు జిల్లా కేంద్రంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో ఆత్మరక్షణ శిక్షణ నిర్వహణపై చర్చించారు. ఆయా సంఘాల ప్రతిని ధుల సూచనలు, అభిప్రాయాలను తీసుకున్న అనంతరం శిక్షణకు ఎంపిక చేసిన పాఠశాలల తుది జాబితాను రూపొందించారు. సిద్ధం చేసిన జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేశారు. దసరా సెలవులు ముగిసిన వెంటనే ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆత్మరక్షణ శిక్షణ తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు.


