ఆర్టీసీ ఎన్నికల ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎన్నికల ప్రచారం

Oct 6 2026 12:00 AM | Updated on Oct 6 2026 12:00 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో టీడబ్ల్యూ–ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఐక్య కూటమి ఆధ్వర్యంలో సోమవారం ప్రచారం ని ర్వహించారు. కూటమి అనుబంధ యూనియ న్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, అలాగే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ తదితర అంశాలపై ఐక్య కూటమి మున్ముందు బలమైన పోరాటాలు చేస్తుందని తెలిపారు. కూటమి అభ్యర్థులను బాణం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఎస్‌డబ్ల్యూ(ఐఎన్‌ టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశ్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ డిపో కార్యదర్శి నారాయణ, డిపో అధ్యక్షుడు లింగన్న, సహా య కార్యదర్శి రాజేశ్వర్‌, ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌, ఐఎన్‌టీయూసీ నాయకురాలు తళ్ల అశ్వి ని, ఐక్య కూటమి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement