డీఈఐసీ కేంద్రాన్ని పరిశీలించిన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి | - | Sakshi
Sakshi News home page

డీఈఐసీ కేంద్రాన్ని పరిశీలించిన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి

Oct 6 2026 12:00 AM | Updated on Oct 6 2026 12:00 AM

నిర్మల్‌ టౌన్‌: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పోరిక రవీందర్‌ జిల్లా కేంద్రంలోని ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌(డీఈఐసీ)ను సోమవారం సందర్శించారు. కేంద్రంలో చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీని పరిశీలించారు. చికిత్స, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే వైకల్యాన్ని గుర్తించి అవసరమైన చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్‌ గబ్బర్‌సింగ్‌, వైద్యులు సంధ్య, సతీశ్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement